Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ వాయిదా..ఎందుకంటే

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే

Published By: HashtagU Telugu Desk
Kalyan Ram Devil

Kalyan Ram Devil

‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ (Kalyan Ram)..ఆ తర్వాత అమిగోస్ అనే సినిమా చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ‘డెవిల్’ (Devil ) అనే సినిమా చేస్తున్నాడు. అభిషేక్‌ నామా (Abhishek Nama) స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త మేనన్‌ హీరోయిన్ నటించింది. ఈ సినిమాను ముందుగా నవంబరు 24న విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఈ సినిమా చెప్పిన డేట్ కు రావడం లేదు. దీనికి కారణం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాతో బిజీగా వున్నారు. డెవిల్ సెకండ్ హాఫ్ ఆర్ఆర్ ఇంకా పూర్తి చేయాల్సివుంది. అలాగే కొంత సిజీ వర్క్ కూడా పెండింగ్‌లో వుంది. ఇలా చాల పెండింగ్ లో ఉండడం తో సినిమాను చెప్పిన టైం కు తీసుకరావడం కష్టంగా మారింది. ఈ క్రమంలో సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు.

Read Also : 2023 World Cup Effect : వరల్డ్ కప్ దెబ్బ కు ‘ఆదికేశవ’ వెనక్కు

  Last Updated: 01 Nov 2023, 04:26 PM IST