కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డెవిల్ (Devil ). పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ గా నవీన్ మేడారం తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 29న తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బింబిసార కలెక్షన్లను టచ్ చేయలేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.4.82 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. కల్యాణ్‌రామ్ గత సినిమా బింబిసార తొలిరోజు రూ.9 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకోగా.. ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా డెవిల్ నిలవకపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పక్కన సలార్ లాంటి మాస్ మసాలా మూవీ ఉండడం తో డెవిల్ ను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదని అంత అనుకుంటున్నారు. ఇక సినిమా కు పాజిటివ్ టాక్ రావడంతో శని , ఆదివారాల్లో కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఏరియా వైజ్ డెవిల్ కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో రూ. 70 లక్షలు
సీడెడ్‌లో రూ. 21 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు
ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు
వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు
గుంటూరులో రూ. 18 లక్షలు
కృష్ణాలో రూ. 11 లక్షలు
నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.68 కోట్లు షేర్, రూ. 3.40 కోట్లు గ్రాస్ రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు రూ. 2.28 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.82 కోట్లు గ్రాస్ వసూలైంది.
Read Also : RGV vs Nagababu : అదేంటి వర్మ.. మీరు ఇంకా బ్రతికే ఉన్నారా..? – నాగబాబు మెగా కౌంటర్