Site icon HashtagU Telugu

Vijay Devarakonda : చిన్నారికి సాయం చేసి విజయ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు

Vijay Devarakonda gives clarity on his marriage in kushi trailer launch event

Vijay Devarakonda gives clarity on his marriage in kushi trailer launch event

చిన్నారికి సాయం చేసి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. చిత్రసీమలో తెరపై మాత్రమే కాదు తెరవెనుక కూడా రియల్ హీరోస్ అని చాలామంది అనిపించుకుంటారు. సినిమాల ద్వారా , యాడ్స్ ద్వారా సంపాదించే డబ్బును సమాజానికి ఉపయోగిస్తూ..ఎవరు ఏ ఆపదలో ఉన్న వారికీ సాయం (Help) చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. మహేష్ బాబు (Mahesh Babu ) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ ఇలా చాలామంది విపత్తుల సమయంలో , ఎవరైనా ఆపదలో ఉన్న సమయంలో వారికీ ఆర్ధిక సాయం అందిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా విజయ్ దేవరకొండ కూడా ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన ఒక చిన్నారికి (Child ) సాయం చేసి వార్తల్లో నిలిచాడు. శ్రీకాకుళం (Srikakulam ) జిల్లా కోటబొమ్మాలికి చెందిన ఒక పాప ఇటీవల అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కాలు (Leg in a road accident) పోగొట్టుకుంది. విజయ్ దేవరకొండ అభిమాన సంఘం ద్వారా ఈ విషయం తెలుసుకున్న హీరో వెంటనే ఆ చిన్నారికి లక్ష రూపాయల చెక్కు పంపించడం జరిగింది. ఈ చెక్కును శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆ చిన్నారికి అందించారు. అలాగే చిన్నారికి సహాయం చేసి తన సహృదయం చాటుకున్న విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా ఖుషి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. త్వరలో ఫ్యామిలీ మాన్ గా సంక్రాంతి బరిలో రాబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది.

Read Also : Boyapati Srinu : స్కంద OTT ఎఫెక్ట్.. బోయపాటిని ఆడేసుకుంటున్న నెటిజన్లు..!