Airport Look : దేవర, కాంతార…ఇద్దరు మాములుగా లేరు

ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా దేవరను కలిశాడు కాంతార ఫేమ్ హీరో రిషబ్ శెట్టి. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Ntr Rishab Shetty

Ntr Rishab Shetty

దేవర – కాంతార (Devara-Kanthara) లు ఒకే ఫ్రెమ్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) ..కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై అభిమానుల్లో , చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొంన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , ప్రమోషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ మూవీ తో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ చేస్తున్నాడు. దేవర కంటే ముందు వార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబదించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఎన్టీఆర్..శనివారం మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా ఎయిర్ పోర్టులో కనిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇదే ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా దేవరను కలిశాడు కాంతార ఫేమ్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. రిషబ్ శెట్టి జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెల్సిందే. అప్పుడే ఎన్టీఆర్.. రిషబ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు కలవడంతో మరోసారి రిషబ్ కు ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. సంప్రదాయబద్ధంగా రిషబ్ కనిపించగా.. క్యాజువల్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దేవర, కాంతార ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Read Also : AP Heavy Rains: అంత చూస్తుండగానే… వరదలో కొట్టుకుపోయాడు

  Last Updated: 31 Aug 2024, 02:49 PM IST