NTR : ఎన్టీఆర్ బర్త్ డేకి.. ఈ అప్డేట్స్ రాబోతున్నాయట.. సాంగ్, గ్లింప్స్, పోస్టర్..!

ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉండబోతున్నాయి. సాంగ్, గ్లింప్స్, పోస్టర్‌తో..

Published By: HashtagU Telugu Desk
Devara War 2 Prashanth Neel Movie Updates Are Coming On Ntr Birthday

Devara War 2 Prashanth Neel Movie Updates Are Coming On Ntr Birthday

NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నారు. ప్రెజెంట్ దేవర, వార్ 2 మూవీస్ లో నటిస్తున్న ఎన్టీఆర్.. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కాగా ఈ నెలలో ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మే 20న ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాలు నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ లో ఉన్న ఈ ఆసక్తికి తగ్గట్లే మేకర్స్ కూడా అదిరిపోయే అప్డేట్స్ ని సిద్ధం చేస్తున్నారట.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. దీంతో ఈ బర్త్ డే బహుమతిగా సినిమా నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారట. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ సాంగ్స్ విన్న టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. సాంగ్స్ పై తమ రివ్యూలు ఇచ్చి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసారు. మరి రేపు రాబోయే మొదటి సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఇక హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2 సినిమా నుంచి కూడా బర్త్ డే గిఫ్ట్ రాబోతుంది. అయితే అది గ్లింప్స్..? పోస్టర్..? అనేది క్లారిటీ లేదు. వార్ 2లోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ సినిమా నుంచి కూడా అప్డేట్ రాబోతుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. మే 20న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బర్త్ డేకి ఈ మూడు అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాబోతున్నాయి.

Also read : Double Ismart : హమ్మయ్యా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలైందిలే.. ఈసారైనా కంప్లీట్ అవుతుందా..?

  Last Updated: 04 May 2024, 03:49 PM IST