Site icon HashtagU Telugu

Prabhas : స్పిరిట్ లో దేవర విలన్..?

Devara Villain for Prabhas Spirit Sandeep Vanga

Devara Villain for Prabhas Spirit Sandeep Vanga

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫస్ట్ రాజస్థాన్ సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాల త్వరగా పూర్తిచేసి రాబోతున్న సినిమాల మీద ఫోకస్ అయ్యాడు ప్రభాస్. ఇప్పటికే హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పౌచి సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్.

ఈ సినిమాతో పాటు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా కి కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ సందీప్ వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాకు భారీ కాస్టింగ్ ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోని విలన్ గా తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ ని ఢీకొట్టే ఆ విధానం ఎవరో కాదు మొన్న ఎన్టీఆర్ తో దేవరలో నటించిన సైఫ్ అలీ ఖాన్.

స్పిరిట్ సినిమాలో కూడా..

తీవ్రతో ఫస్ట్ సౌత్ మూవీని ఓకే చేసిన సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సైఫ్ మాత్రమే కాదు ఈ సినిమాలో కరీనాకపూర్ కూడా నటించే ఛాన్స్ ఉన్నాయట. B భార్యాభర్తలు ఇద్దరినీ తన సినిమా కోసం బుక్ చేసుకున్నాడట సందీప్ వంగా (Sandeep Vanga). ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

సీతారామమ్, హాయ్ నాన్న రెండు వరస హిట్లు కొట్టాక మూడో సినిమా ఫ్యామిలీ స్టార్ తో ఫెయిల్యూర్ చవిచూసింది మృనాల్ ఠాకూర్. ఫ్యామిలీ స్టార్ తర్వాత ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయి. ఫైనల్ గా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఆల్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా భారీ రిలీజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ లక్కు తగిలినట్టే అని చెప్పొచ్చు.

Also Read : Where is Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కడ..?