Devara Ticket Price Hike : దేవర (Devara) మేకర్స్ కు దేవర మేకర్స్ కు గుడ్ న్యూస్ తెలిపాయి తెలంగాణ , ఆంధ్ర సర్కార్. దేవర టికెట్ ధరలు పెంచుకునే (Devara Ticket Price Hike) అవకాశం కల్పించింది. చిత్రసీమ విషయంలో తెలంగాణ సర్కార్ ఎప్పుడు సానుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గత బిఆర్ఎస్ ప్రభుత్వమైనా..ఇప్పుడు రేవంత్ సర్కారైనా సరే చిత్రసీమ విషయంలో వారికీ అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం తో పాటు బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇస్తూ వస్తున్నారు. ఇటీవల వచ్చిన చాల పెద్ద సినిమాలకు అలాగే చేసారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే చేసారు.
తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325
ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ తో పాటు ఏపీ సర్కార్ దేవర కు టికెట్ రేట్లు పెంచుకునేందుకుఅనుమతి ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ అనుమతి తో మేకర్స్ తో పాటు డిస్ట్రబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మేకర్స్ సైతం సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచారు.
తాజాగా డీజే టిల్లు సిద్దు (Sidhu Jonnalagadda) , మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో చిట్ చాట్ (Chit Chat) చేసారు. ఈ చిట్ చాట్ లో ఎన్టీఆర్ (Jr NTR) తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి రాబట్టలేని కొన్ని ప్రశ్నల సమాధానాలను వారు ఈ ఇంటర్వ్యూలో రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్వ్యూ మొత్తం కూడా చాల ఫన్నీ గా సాగుతుందని, ఇంటర్వ్యూలో సిద్దు, సేన్ లు పోటీ పడి మరీ ఎన్టీఆర్ ను సరదాగా ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు అడిగారని, వాటికి ఎన్టీఆర్ తనదైన శైలిలో చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also :Walking Style : నడక ద్వారా మీ వ్యక్తిత్వాన్ని కొలవవచ్చు..!