NTRNeel : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన టీం.. ఆ నెలలోనే మొదలు..

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్. ఈ ఏడాదిలోనే మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేసారు.

Published By: HashtagU Telugu Desk
Devara Star Ntr Prasanth Neel Movie Shooting Update

Devara Star Ntr Prasanth Neel Movie Shooting Update

NTRNeel : నేడు మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు తారక్ కి విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల నుంచి బర్త్ డే గిఫ్ట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ఒక రోజు ముందుగానే.. నిన్న ‘దేవర’ నుంచి మొదటి సాంగ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తాజాగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్ నీల్ తన డ్రీం ప్రాజెక్ట్ కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే బిన్నంగా ఈ మూవీ ఉంటుందని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. దీంతో ఈ మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలు కానుందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్.. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ని తెలియజేసారు. ఈ ఏడాది ఆగష్టులోనే ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేస్తూ.. ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.

ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఎటువంటి మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసారో చూడాలి. కాగా ఈ మూవీ షూటింగ్ ని పలు దేశాల్లో అనేక లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, కళ్యాణ్ రామ్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

  Last Updated: 20 May 2024, 10:42 AM IST