Site icon HashtagU Telugu

NTR : ఇవేమి మాస్ సెలబ్రేషన్స్‌రా బాబు.. నెల రోజులు ముందు నుంచే ఎన్టీఆర్ బర్త్ డే..

Devara Star Ntr Fans Starts His Birthday Celebrations Starts Early

Devara Star Ntr Fans Starts His Birthday Celebrations Starts Early

NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. మీసాలు రాని వయసులోనే రికార్డులు సృష్టించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫాలోయింగ్ తో టాలీవుడ్ లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ స్టార్ గా కొనసాగుతున్నారు. కాగా వచ్చే నెల ఈ మాస్ హీరో పుట్టినరోజు ఉంది. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఫ్యాన్స్ నెల ముందే స్టార్ట్ చేసేసారు.

హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ ని పెట్టి డీజేతో మాస్ జాతర చేస్తున్నారు. కేవలం ఆ థియేటర్ వద్దనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల.. భారీ కట్ అవుట్స్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే.. దేవర అండ్ వార్ 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆ షెడ్యూల్ ని పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. ఇప్పుడు దేవర సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుంటే ఎన్టీఆర్ రా ఏజెంట్ గా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగష్టులో రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.

దేవర విషయానికి వస్తే.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. ఇక బర్త్ డే రోజు ఈ రెండు సినిమాలు నుంచి ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Also read : Raj Tarun : జీవితంలో పెళ్లి చేసుకోను అంటున్న రాజ్ తరుణ్.. వాళ్ళ అమ్మానాన్నలు..