NTR : సినిమా షూటింగ్స్‌కి బ్రేక్.. బర్త్ డే వెకేషన్‌కి ఎన్టీఆర్..

సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చేసి.. బర్త్ డే వెకేషన్‌కి బయలుదేరిన ఎన్టీఆర్. ఒక వారం రోజుల పాటు..

Published By: HashtagU Telugu Desk
Devara Star Jr Ntr Off To Dubai For His Birthday Vacation

Devara Star Jr Ntr Off To Dubai For His Birthday Vacation

NTR : జూనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. తాను మెయిన్ లీడ్ లో చేస్తున్న ‘దేవర’ షూటింగ్ ని కొనసాగిస్తూనే.. హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2’లో ఒక ముఖ్య పాత్ర షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీంతో కొన్ని రోజులు హైదరాబాద్‌లో, కొన్ని రోజులు ముంబైలో ఉంటూ వస్తున్నారు. మొన్ననే ముంబై నుంచి తన ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు హైదరాబాద్ వచ్చారు.

తాజాగా ఈ హీరో వెకేషన్ కోసం దుబాయ్ బయలుదేరారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుట్టినరోజు ఎన్టీఆర్ అభిమానులకు చాలా స్పెషల్ కాబోతుంది. దేవర మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతుంది. వార్ 2 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది. అలాగే ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందట. ఇలా క్రేజీ అప్డేట్స్ తో అభిమానులకు ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ కాబోతుంది.

ఇక ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఈ బర్త్ డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతుంటే.. ఎన్టీఆర్ కూడా తన సతీమణి ప్రణతితో ఈ బర్త్ డే స్పెషల్ గా జరుపుకునేందుకు వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే నేడు తన సతీమణి ప్రణతితో కలిసి దుబాయ్ వెకేషన్ కి బయలుదేరారు. ఒక వారం రోజుల పాటు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి.. దుబాయ్ లో బర్త్ డే వెకేషన్ ని ఎంజాయ్ చేయనున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరిన ఎన్టీఆర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

  Last Updated: 14 May 2024, 07:56 PM IST