Site icon HashtagU Telugu

Devara ప్రభంజనం.. 4 లక్షల 95 వేల టిక్కెట్లు బుకింగ్

Devara Prabhajanam

Devara Prabhajanam

ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ విడుదలకు ముందే అనేక రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే పలు రికార్డ్స్ నెలకొల్పగా..ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూడా అరుదైన రికార్డు సాదించింది.

ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ఎల్లుండి (SEP27) ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి అఖండ విజయం సాధించింది. దీంతో దేవర ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదే సందర్బంగా సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచడం తో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు.

అభిమానుల అంచనాలకు , ఎదురుచూపులు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేవర క్రేజ్ మాములుగా లేదు. ఇక USAలో కూడా ప్రీ సేల్స్ లో రోజుకో రికార్డుని నమోదు చేస్తుంది. నార్త్‌ అమెరికాలో ‘దేవర’ ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అలవోకగా దాటేసింది. ఇక ఈ సినిమాకి అడ్వాన్స్‌ బుకింగ్స్ ద్వారా ఏకంగా 21 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదయ్యయ్యయి. అంటే దాదాపు 4 లక్షల 95 వేల టిక్కెట్లు ఈ సినిమాకి బుక్ అయ్యాయి అన్నమాట. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే తాజాగా ఇంకో అదిరిపోయే రికార్డుని సృష్టించింది. ఈ సినిమాకి యూఎస్ఏ ప్రీమియర్ సేల్స్ లో ఏకంగా 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని మూవీ టీం తెలియజేసింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ రికార్డుతో దేవర రికార్డుల ఊచకోత కోయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ .

Read Also : Hydraa – Home Loan : బాధితుల హోమ్ లోన్స్ ను ‘హైడ్రా’ మాఫీ చేయబోతుందా..?