Devara Screening on ‘Dolby Atmos’ in the UK : ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ విడుదలకు ముందే అనేక రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే పలు రికార్డ్స్ నెలకొల్పగా..తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులతో పాటు సినీ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి అఖండ విజయం సాధించింది. దీంతో దేవర ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదే సందర్బంగా సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచడం తో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచుతూ సినిమా తాలూకా విశేషాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలు తెలియజేయగా..తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించి మరింత ఆనందం నింపారు. అలాగే రేపు ఈ మూవీ లోని ఆయుధ పూజా అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా డీజే టిల్లు సిద్దు (Sidhu Jonnalagadda) , మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో చిట్ చాట్ (Chit Chat) చేసారు. ఈ చిట్ చాట్ లో ఎన్టీఆర్ (Jr NTR) తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చారు రెండు ప్రభుత్వాలు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ అనుమతి తో మేకర్స్ తో పాటు డిస్ట్రబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Study: మాంసాహారం, పాల ప్రొటీన్లతో ఆ కణితులకు చెక్.. తాజా అధ్యయనం వెల్లడి