Devara Release Date : దేవర రిలీజ్ డేట్ వచ్చేసింది..ఇక పూనకాలే

RRR తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ.ఎన్టీఆర్ (NTR)..ఇప్పుడు దేవర (Devara ) మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో శివ – ఎన్టీఆర్ కలయికలో జనతా గ్యారెంజ్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. […]

Published By: HashtagU Telugu Desk
Devara Release Date

Devara Release Date

RRR తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ.ఎన్టీఆర్ (NTR)..ఇప్పుడు దేవర (Devara ) మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో శివ – ఎన్టీఆర్ కలయికలో జనతా గ్యారెంజ్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. దీంతో మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఇక ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా పాత్రలో నటిస్తున్నాడు.

దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజ్‌లో ‘దేవర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాతలు నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ తీర్చిదిద్దిన పోరాటలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులోని అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ కోసం జోడించిన వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులను అద్భుతమైన అనుభూతికి లోను చేస్తాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : Congress : కాంగ్రెస్ గూటికి చేరిన బిఆర్ఎస్ కీలక నేతలు..

  Last Updated: 16 Feb 2024, 04:28 PM IST