Site icon HashtagU Telugu

NTR Devara : దేవర.. ఎన్టీఆర్ ప్రెస్టీజ్ గా తీసుకున్నాడా..?

Is NTR Triple Role in Devara

Is NTR Triple Role in Devara

NTR Devara RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ మొన్నటిదాకా యంగ్ టైగర్ గా ఉన్న స్క్రీన్ నేం కాస్త మాన్ ఆఫ్ మాసెస్ అని మార్చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు అయ్యేలా చేశాడు. రీసెంట్ గా జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కు వచ్చిన తారక్ ఎప్పుడు లేనిది దేవర మీ అందరినీ కాలర్ ఎగురవేసుకునేలా చేస్తుందని ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడాడు.

అంతేకాదు దేవరలోని డైలాగ్ ని వినాలని చెప్పి మరీ త్రివిక్రం కు ఒక అదిరిపోయే డైలాగ్ చెప్పాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత దేవర అన్ని పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో వస్తుందని తెలుస్తుంది. అయితే సినిమాలో ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా సినిమా అన్ని క్రాఫ్టుల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలుస్తుంది. కొరటాల శివకు ఫుల్ సపోర్ట్ గా సినిమా ఆశించిన దాని కన్నా నెక్స్ట్ లెవెల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.

దేవర సినిమాను ఎన్టీఆర్ చాలా ప్రీస్టీజ్ గా తీసుకున్నాడని అర్ధమవుతుంది. సినిమాను ఎలాగైనా గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేయాలని తారక్ కష్టపడుతున్నాడట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తను చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వాటికి ఒక మెట్టు పైనే సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఏప్రిల్ రిలీజ్ అనుకున్న సినిమా అక్టోబర్ కి వెళ్లింది.

అనుకున్న అవుట్ పుట్ రాకపోతే అక్టోబర్ నుంచి కూడా వాయిదా వేసినా వేయొచ్చు. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట కోసం దేవర ని బ్లాక్ బస్టర్ చేసేందుకు ఎన్టీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇంత ఫోకస్ తో చేస్తున్న దేవర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దేవర కూడా రెండు భాగాలుగా వస్తుండగా దేవర 1 అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్..!

Exit mobile version