Site icon HashtagU Telugu

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ వేడుక రద్దు

Devara Pre Release Event Ca

Devara Pre Release Event Ca

Devara Pre Release Event Cancelled : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Devara Pre Release Event) రద్దయింది. హైదరాబాద్ నోవాటెల్ లో ఈ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ..అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈవెంట్ రద్దు చేసారు నిర్వాకులు. ఇచ్చిన పాస్ ల సంఖ్య కంటే ఎక్కువమంది రావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు.

అభిమానులు భారీగా పోటెత్తగా.. వేదిక ఏ మూలకు సరిపోలేదు. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో పలువురు కిందపడిపోగా.. ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు ఫర్నీచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎక్స్‌ట్రా పాసులు అమ్మడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు వచ్చినట్లు చెపుతున్నారు. ఎందుకు ఎక్కువ అమ్మడం..ఎందుకు రద్దు చేయడం అని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి దేవర విషయంలో వరుస అవాంతరాలు ఎదురు అవుతుండడం తో ఫ్యాన్స్ నిరాశకు గురి అవుతున్నారు.

Read Also : Devara Pre Release Event Cancelled