Site icon HashtagU Telugu

Devara Pre Release : దేవర ప్రీ రిలీజ్ వేదిక ఫిక్స్

Devara Pre Release

Devara Pre Release

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Devara pre release) వేదిక విషయంలో అభిమానుల్లో అనేక అనుమానాలు ఉండగా..మేకర్స్ అనుమానాలకు తెరదించారు. ఈ నెల 22 న హైదరాబాద్లోని నోవాటెల్ HICC (HICC Novotel) లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా జరపబోతున్నట్లు తెలిపి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి అఖండ విజయం సాధించింది. దీంతో దేవర ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదే సందర్బంగా సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచడం తో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లో భాగంగా ఈ నెల 22 న హైదరాబాద్లోని నోవాటెల్ HICCలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. మరోపక్క ఈరోజు ఉదయం డైరెక్టర్ కొరటాల శివ ..సినిమా సక్సెస్ కావాలని కోరుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ సినిమా పెద్ద విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు.

Read Also : Home Registrations : హైదరాబాద్‌లో ఆగస్టులో స్వల్పంగా తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు