Site icon HashtagU Telugu

NTR Devara: దటీజ్ తారక్.. ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ హావా

NTR Devara

NTR Devara

NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దేవరపై పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. జనతా గ్యారేజ్ సినిమాతో తారక్ కు మంచి హిట్ ఇచ్చిన కొరటాల.. ఈసారి దేవర లాంటి మాస్ మసాలా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా దేవర కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది. దేవర ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అని టాక్ బలంగా వినిపిస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా కొరటాల దేవరను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నారు.

ఇటీవల దేవర మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో..? ఎన్టీఆర్ నటన ఎలా ఉండబోతుందో..? శాంపిల్ చూపించారు. దీనికి వావ్ అంటూ అభిమానులే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. దీంతో దేవర పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ మారనుందని.. దేవర వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సివుంది. త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ఓవర్ సీస్ లో రికార్డ్ రేటు దక్కిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎంతంటే.. దేవర ఓవర్ సీస్ రైట్స్ 27 కోట్లకు అమ్మారట. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో ఇంత భారీ రేటు దక్కింది. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ కు ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఈ అమౌంట్ ను వసూలు చేయడం అంత కష్టమేమి కాదు. దీనికి తోడు ఎన్టీఆర్, కొరటాల కాంబో హిట్ కాంబో. అందుచేత ఓవర్ సీస్ లో దేవర సంచలనం సృష్టించడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడో చూడాలి.

Also Read: Paruchuri Review on Prabhas Salaar : స్క్రీన్ ప్లే తో ఆటాడుకున్నాడు.. ప్రభాస్ సలార్ పై పరుచూరి రివ్యూ..!