యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) లేటెస్ట్ సెన్సేషన్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ మూవీ ని నిర్మించగా.. జాన్వి కపూర్ హీరోయిన్ నటించింది. అనిరుద్ సంగీతం అందించారు. అయితే దేవర (Devara) రిలీజ్ డే నాడు టాక్ బాగాలేకపోయినా తర్వాత తర్వాత సినిమా పుంజుకుంది. వసూళ్లలో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన దేవర మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. ఐతే దేవర థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ వారం ఈ మూవీ ఓటిటి లో సందడి చేయబోతుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) దేవర ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకోగా… ఈ వారం అంటే నవంబర్ 7న ఈ మూవీ ని ఓటిటి లో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ (Netflix ) సిద్ధమైంది. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజైంది. దేవర 2 కోసం రెండేళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. మరి దేవర ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా రికార్డులు కొల్లగొడుతుందా లేదా అన్నది చూడాలి.
ఈ వారం తో దేవర తో పాటు వేట్టయన్ .. ARM .. జనక అయితే గనక స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో ‘వేట్టయన్’ ప్రేక్షకులను పలకరించనుంది. రజనీకాంత్ – జ్ఞానవేల్ కాంబినేషన్లో అక్టోబర్ 10న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తమిళనాట భారీ విజయాన్ని అందుకుంది. లైకా ప్రొడక్షన్స్ వారి బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఆశించినంత విజయం సాధించలేకపోయింది. టోవినో థామస్ – కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ARM కూడా ఈ వారం హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక సుహాస్ – సంకీర్తన జంటగా నటించిన ‘జనక అయితే గనక’ కూడా ఇదే రోజున ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం మీద ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు పండగే.
Read Also : TTD Regulations : టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు