ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ (NTR) తో చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను ముందు ఒక ప్రాజెక్ట్ గా చేయాలని అనుకున్నా సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో రెండు భాగాలుగా తీస్తున్నారు. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ అన్ని అంచనాలకు తగినట్టుగానే ఉన్నాయి. దేవర సినిమా కోసం కొరటాల శివ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది.
NTR Devara దేవర కోసం కొరటాల శివ (Koratala Siva) భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమా రెండు భాగాలకు కలిపి దాదాపు 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. దేవర కోసం ఎన్ టీ ఆర్ కూడా దాదాపు 60 నుంచి 80 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది. దేవర సినిమాలో తారక్ తో జాన్వి కపూర్ రొమాన్స్ చేసింది. సైఫ్ అలి ఖాన్ సినిమాలో విలన్ గా నటించాడు.
ఫలితం పై పూర్తి నమ్మకంగా..
సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న దేవర సినిమా కోసం యూనిట్ అంతా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది. ఎన్టీఆర్ అయితే ఈ సినిమా ఫలితం పై పూర్తి నమ్మకంగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
దేవర సినిమా బిజినెస్ విషయంలో అదరగొట్టేసింది. అంతేకాదు రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ కలెక్షన్స్ తో కుమ్మేస్తుంది. చూస్తుంటే దేవర మొదటి రోజే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టేలా ఉంది.
Also Read : Nayanatara : అమ్మోరుగా మరోసారి నయనతార..!