Jr NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా ముందుకు సాగుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం కోట్లల్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక తనకి ఇంతటి స్టార్‌డమ్ ని తెచ్చిపెట్టి, తాను ఇంతలా పారితోషకం తీసుకునేలా చేసిన ఆడియన్స్ విషయంలో ఎన్టీఆర్ ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం చూపిస్తూ వస్తుంటారు.
ఈక్రమంలోనే ఎన్టీఆర్ ఒక గుడి కోసం లక్షల్లో విరాళం ఇచ్చి తన కృతజ్ఞత భావంతో పాటు భక్తి భావాన్ని కూడా చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో నెలకున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయానికి ఎన్టీఆర్ ఆకాశరాల రూ.12.5 విరాళం ఇచ్చారు. ఆలయ ప్రహరీ గోడ నిమిత్తం ఎన్టీఆర్ ఈ విరాళాన్ని ఇచ్చారు. ఎన్టీఆర్ విరాళం ఇవ్వడం, ఆ ప్రహరీ నిర్మాణం అవ్వడం కూడా ఎప్పుడో పూర్తి అయ్యిపోయింది.
కానీ ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్లు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. రీసెంట్ గా ఆ ఆలయం బయట శిలాఫలకం వేశారు. ఆ తరువాతే ఎన్టీఆర్ ఆ గుడికి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. ఆ శిలాఫలకం పై ఎన్టీఆర్, తల్లి షాలిని, భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేరులు కూడా చెక్కించారు. ప్రస్తుతం ఆ గుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
NTR @tarak9999 Anna Donated 12.5 Lakhs To Sri Bhadrakaali Sametha Veerabhadra Swamy Vaari Aalayam In Jaggannapeta, East Godavari 👌🙏❤️. #JrNTR pic.twitter.com/5uhNWhoRhq
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) May 15, 2024
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ పుట్టినరోజుకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతుంది. అలాగే వార్ 2 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్, ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందట. ఎన్టీఆర్ ఏమో ఈ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు.