Devara Ayudha Pooja Song : ఎన్టీఆర్ (NTR) అభిమానులు, సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర (Devara) మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడం..అది కూడా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడం తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉండబోతుందో..? కథ ఏంటో..? కొరటాల తన మార్క్ చూపించాడో లేదో అని ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మేకర్స్ చిత్రంలోని ఆయుధపూజ సాంగ్ (Ayudha Pooja) ను విడుదల చేసి గూస్ బంప్స్ తెప్పించారు.ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల భైరవ తన బేస్ వాయిస్ తో ఆలపించాడు.
ఇక ఈ సాంగ్ లో రణధీరులుగా ఎన్టీఆర్, సైఫ్, శ్రీకాంత్ మొత్తం డ్యాన్స్ చేస్తూ కనిపించినట్లు తెలుస్తోంది. లిరిక్స్ ను బట్టి సముద్రంలో వేటకు వెళ్లేముందు గ్రామస్తులు అందరు కలిసి చేసే ఆచారంలా కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఆయుధ పూజ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. నిరాశపడకుండానే అనిరుధ్ మ్యూజిక్ ను అందించినరట్లు కనిపిస్తోంది. సాంగ్ మొత్తం ఎక్కడా స్లో అవ్వకుండా మంచి హైప్ ను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి..ఇక తెరపై ఏ రేంజ్ లో ఉంటుందో అని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు, ఇందులో యువ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్ కనిపించనుంది, ఈ చిత్రంలో శ్రుతి పెద్ద ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న దేవర, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దేవర సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి మొదలు పెట్టారు.
Read Also : Automatic or Manual Car : మహిళల కోసం కారు కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!