NTR Devara ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర రెండు భాగాలుగా చేస్తున్నాం అంటూ కొరటాల శివ లేటెస్ట్ అనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేసిన కొరటాల శివ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబో సినిమా వస్తుంది. R.R.R తో గ్లోబల్ వైజ్ మార్కెట్ సంపాదించిన ఎన్టీఆర్ తో దేవర అంటూ ఒక పవర్ సినిమా చేస్తున్నాడు కొరటాల శివ.
అయితే దేవర 2 పార్టులుగా రిలీజ్ అన్నది కొరటాల శివ చెప్పకుండా ఓ టీజర్ గ్లింప్స్ వదిలి అందులో దేవర 1 అని అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కి వచ్చే హై ఓ రేంజ్ లో ఉంటుంది. ఈమధ్యనే ప్రభాస్ సలార్ ని కూడా ఒక పార్ట్ గానా రెండు పార్టులుగానా అన్నది క్లారిటీ ఇస్తూ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అంటూ సర్ ప్రైజ్ చేశారు.
Also Read : 800 Biopic: ముత్తయ్య మురళీధరన్‌గా మధుర్ మిట్టల్.. మేకింగ్ వీడియో చూశారా!
ఎన్టీఆర్ దేవర (NTR Devara) రెండు భాగాలు అంటూ కొరటాల శివ (Koratala Siva) స్పెషల్ వీడియో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసినా ఓ గ్లింప్స్ లాంటిది వదిలితే నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని చెప్పుకుంటున్నారు. దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ అందాల భామ సారా అలీ ఖాన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. తప్పకుండా అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఎన్టీఆర్ దేవర దుమ్ముదులిపేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join