Site icon HashtagU Telugu

Naga Chaitanya: జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా.. నాగచైతన్య ఎమోషనల్

1200325824 Naga Chaitanya Reveals Biggest Regret 1280 720

1200325824 Naga Chaitanya Reveals Biggest Regret 1280 720

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మే 12న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారిగా నటించాడు. సినిమా రిలీజ్ కు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రమోషన్స్ కార్యక్రమాలను సినిమా యూనిట్ షురూ చేసింది. అందులో భాగంగా పలు ఛానెళ్లకు నాగచైతన్య ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కాస్త ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఆయన బయటపెట్టాడు. మీ జీవితంలో పశ్చాత్తాపబడ్డ సంఘటనలు, విచారణమైనవి ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు నాగచైతన్య సమాధానమిచ్చాడు. తన జీవితంలో అలాంటివి ఏమీ లేదని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తన జీవితంలో విచారకరమైన సంఘటనలు ఏవీ లేదని తెలిపారు.

జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఎన్నో పాఠాలు నేర్పుతుందని నాగచైతన్య తెలిపాడు. సినిమాల విషయంలో కొన్నిసార్లు బాధపడ్డానని, కొన్ని సినిమాలపై సరిగ్గా నిర్ణయం తీసుకోలేకయినట్లు చెప్పాడు. సినిమాలు సరిగ్గా ఎంచుకోలేకపోయానని పశ్చాత్తాపపడ్డానని, మూడు సినిమాల విషయంలో బాధపడ్డానని అన్నారు. ఈ సినిమాపై నాగచైతన్య భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే నెల రోజుల నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాగా నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించాడు. ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.దీంతో కస్టడీ సినిమాపై నాగచైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకే స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. పినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా రియల్ పోలీసులతో నాగచైతన్య మాట్లాడుతూ వీడియోలు విడుదల చేస్తున్నాడు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అటు అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.