Site icon HashtagU Telugu

Prabhas : హీరో ప్రభాస్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..!!

Adipurush

Adipurush

ఆదిపురుష్ మూవీ యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గంవారి మనోభాలు గాయపర్చారని దాఖలైన పిల్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూవీ యూనిట్ తోపాటు హీరో ప్రభాస్ కు కూడా నోటీసులు జారీ చేశారు.

ఆదిపురుష్ టీజర్ ను చిత్ర యూనిట్ ఈమధ్యే రిలీజ్ చేసింది. ఈ టీచర్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. చిత్ర యూనిట్ పై ట్రోల్స్ చేశారు. దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేశారు నెటిజన్లు. దేవుళ్లను తప్పుగా చూపారంటూ న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. రాముడిని క్రూరంగా చూపారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆదిపురుష్ మూవీకి నోటీసులు జారీ చేసింది.