Dekhlenge Saala Song: చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి ఎనర్జిటిక్ స్టెప్పులు

Dekhlenge Saala Song: 'దేఖ్‌లేంగే సాలా' పాటలో సెటప్, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. పాటలోని కలర్‌ఫుల్ సెట్టింగ్స్, భారీ బ్యాక్‌డ్రాప్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Dekhlenge Saala Lyrical Vid

Dekhlenge Saala Lyrical Vid

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చాలా రోజులుగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఫుల్ మీల్స్ లాంటి అప్డేట్‌ను అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘దేఖ్‌లేంగే సాలా’ అనే సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ అట్టహాసంగా విడుదల చేశారు.

Loco Pilot Salary: రైల్వే లోకో పైలట్ జీతం.. వందే భారత్ డ్రైవర్లకే అత్యధిక వేతనమా?!

“రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా” అంటూ మాస్ బీట్‌తో సాగిన ఈ ఉస్తాద్ సాంగ్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రీలీలతో కలిసి వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ చూపించి మరో మంచి డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు. పవన్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా దినేష్ మాస్టర్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విశాల్ దడ్లానీ ఉషారుగా ఆలపించిన ఈ పాటకు భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్ అందించారు.

‘దేఖ్‌లేంగే సాలా’ పాటలో సెటప్, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. పాటలోని కలర్‌ఫుల్ సెట్టింగ్స్, భారీ బ్యాక్‌డ్రాప్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై అంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తుండటం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా పాటను అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రీకరించారు. ఈ మాస్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

  Last Updated: 13 Dec 2025, 08:22 PM IST