Deepti Sunaina Shadow Glamour Treat సోషల్ మీడియా ఫాలోవర్స్ కి పరిచయం అవసరం లేని పేరు దీప్తి సునైనా. యూట్యూబ్ కవర్ సాంగ్స్ తో సూపర్ పాపులర్ అయిన దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా వెళ్లింది. ఆ సీజన్ లో తనీష్ తో మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్ టైన్ చేసిన దీప్తి సునైనా బయటకు వచ్చాక లైట్ తీసుకుంది. ఇక మరో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో దీప్తి సునైనా ప్రేమాయణం అందరికీ తెలిసిందే.
ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్న వీరి లవ్ స్టోరీ కూడా బ్రేక్ పడింది. బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ హౌజ్ లోకి వెళ్లి అక్కడ సిరితో క్లోజ్ అవ్వడం నచ్చని దీప్తి బయటకు వచ్చాక షణ్ముఖ్ కి గుడ్ బై చెప్పేసింది. అయితే ఈమధ్య పెద్దగా సోషల్ మీడియాలో హడావిడి లేని దీప్తి సునైనా అటు కెరీర్ పరంగా కూడా పెద్దగా గ్రోత్ కనిపించడం లేదు.
Also Read : Natural Star Nani : నాని సినిమాకు బడ్జెట్ సమస్యలా.. 100 కోట్లు కొట్టినా నమ్మట్లేదా..?
అయితే సడెన్ గా దీప్తి సునైనా తన సోషల్ మీడియాలో ఒక డార్క్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. బ్లాక్ స్లీవ్ లెస్ గౌనుతో షాడో గ్లామర్ ట్రీట్ అందిస్తూ సర్ ప్రైజ్ చేసింది దీప్తి సునైనా. అమ్మడు ఇలా స్లీవ్ లెస్ లో కనిపించడం బహుశా మొదటిసారి అని చెప్పొచ్చు. గ్లామర్ షో చేయాలా వద్దా అనుకుంటూ దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది.
దీప్తి ఈ ఫోటో షూట్ షేర్ చేస్తూ వై దిస్ కొలవెరి డి అని కామెంట్ పెట్టింది. అంటే ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఏంటని నెటిజన్లు తన గురించి మాట్లాడుకుంటారని ముందే కనిపెట్టి మరి అమ్మడు ఈ పిక్స్ షేర్ చేసిందన్నమాట. ఏది ఏమైనా దీప్తి ఈ రేంజ్ గ్లామర్ షో చేయడం ఆమెని ఇన్నాళ్లు ఫాలో అవుతూ వస్తున్న ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
