Site icon HashtagU Telugu

Deepika with Mahesh: క్రేజీ కాంబినేషన్.. దీపికతో రొమాన్స్ చేయనున్న టాలీవుడ్ ప్రిన్స్!

Mahesh

Mahesh

‘RRR’ అద్భుత విజయం తర్వాత..  డైరెక్టర్ S.S రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి . విజయేంద్ర ప్రసాద్, నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి ప్రేరణ పొందాడని, ఆయా ఘటనలతో అందించే కథతోనే సినిమా రూపుదిద్దుకుంటుందని టాక్. అయితే మహేష్ బాబు సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటించనుందని తాజా సంచలనం.

తాత్కాలికంగా ‘SSMB29’ అనే టైటిల్ పెట్టబడిన ఈ చిత్రం అడ్వెంచర్ డ్రామా. 2023 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీపిక మహేష్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. దీపిక ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ K’ అనే మరో పాన్-ఇండియా చిత్రంతో బిజీగా ఉంది. ఆమె ప్రభాస్, అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టితో కలిసి కనిపిస్తుంది. కోవిడ్ కారణంగా ఒక సంవత్సరం ఆలస్యం అయిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో దీపిక ‘ప్రాజెక్ట్ K’ సెట్స్‌లో అస్వస్థతకు గురైంది. త్వరగా కోలుకోవడంతో షూటింగ్‌కి తిరిగి వచ్చింది. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.