Site icon HashtagU Telugu

Deepika Padukone: లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయిన దీపికా, హృతిక్ తో బెస్ట్ కెమిస్ట్రీ

Deepika

Deepika

Deepika Padukone: గణతంత్ర దినోత్సవం 2024 నాడు విడుదల కానున్న సిద్ధార్థ్ ఆనంద్ రాబోయే యాక్షన్ డ్రామా ఫైటర్ టీజర్ సంచలనాన్ని సృష్టిస్తోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ఆన్-స్క్రీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. బహుశా గత దశాబ్దంలో బాలీవుడ్ చూసిన అత్యంత డైనమిక్ ద్వయంగా చెప్పవచ్చు. ఈ మూవీలో దీపికా, హృతిక్ మధ్య ఘాటైన ద్రుశ్యాలు ఉంటాయి.అంతేకాదు.. లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయి.

ఈ ఇద్దరు రెచ్చిపోయి నటించడంతో.. దీపికా, రణవీర్ సింగ్ మధ్య కెమిస్ట్రీని కూడా మించిపోతుందని నెటిజన్స్ అంటున్నారు. హృతిక్‌తో తన కెమిస్ట్రీ బెస్ట్ అని దీపిక చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి.

ఈ టీజర్ లో దీపికా పదుకొణె, హృతిక్ రోషన్ లిప్ లాక్ సీన్స్, బికినీ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. వారిద్దరి మధ్య రొమాన్స్ నెక్ట్స్ లెవల్ అనిఅంటున్నారు సినీ ఫ్యాన్స్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన “ఫైటర్”లో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ మరియు ఇతరులతో సహా తారాగణం కూడా ఉంది. ఈ టీజర్ ను చూసినవాళ్లు బాలీవుడ్ ఫ్యాన్స్ పఠాన్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.