Deepika Padukone బాలీవుడ్ భామ దీపికా పదుకొనె స్టార్ ఫాం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఓం శాంతి ఓం (Om Shanthi Om) నుంచి రీసెంట్ గా వచ్చిన జవాన్ (Jawan) వరకు దీపిక ఏ పాత్ర చేసినా అందులో గ్లామర్ గ్రామర్ రెండు అదిరిపోతాయి. దీపిక ఏ సినిమా చేసినా అందులో తన ముద్ర ఉంటుంది. చేసే పాత్ర నిడివి తక్కువే అయినా అమ్మడి ఇంప్యాక్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంది. భర్త రణ్ వీర్ తో తన సినిమాల విషయాలను పంచుకుంటానని చెప్పిన దీపిక షూటింగ్ టైం లో ఇంటి విషయాలను అసలు ప్రస్థావించనని అన్నది.
అంతేకాదు యాక్టర్ ని కాకుండా కచ్చితంగా తాను క్రీడాకారిణిని అయ్యే దాన్నని.. అందుకే కెరీర్ లో ఓటమిలు వచ్చినా ఎంతో హుందగా తీసుకుంటానని అన్నది దీపిక (Deepika). ఇక భర్త తో కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా షారుఖ్ ఖాన్ తో డిస్కస్ చేస్తానని అన్నది దీపిక. షారుఖ్ హీరోగా చేసిన ఓం శాంతి ఓం సినిమాతోనే దీపిక బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
Also Read : Prabhas : అసంతృప్తిలో ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేశారేంటో..!
అందుకే ఆమె కు షారుఖ్ (Shahrukh Khan) అంటే ప్రత్యేకమైన అభిమానం. షారుఖ్ తో సినిమా అంటే తానేమి ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానని ఆయన తన లక్కీ ఛార్మ్ అని అన్నారు దీపిక. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమాలో నటిస్తున్న దీపిక ఆ సినిమాతో తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తుంది.
అంతకుముందు తెలుగు ఆఫర్లు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోని దీపిక పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న ఈ టైం లో అమ్మడు ఇక్కడ ఆఫర్లను ఓకే చేయక తప్పలేదు. కల్కి సినిమాలో నటించేందుకు దీపిక 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుందని టాక్.