Deepika Pilli : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి.. హీరో ఎవరంటే..?

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న దీపికా పిల్లి. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా..?

  • Written By:
  • Publish Date - June 9, 2024 / 11:02 AM IST

Deepika Pilli : అప్పుడెప్పుడో 90’sలో టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా కనిపించేవారు. కానీ ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు దూరమయ్యారు. ఒకరిద్దరు వస్తున్నా, వారిని టాలీవుడ్ మేకర్స్ పట్టించుకోకపోవడంతో.. ఇతర పరిశ్రమల్లోకి వెళ్లి అక్కడ ఒకటి రెండు సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ తెలుగు అమ్మాయిల రాక మొదలయింది. ఇప్పటికే ‘వైష్ణవి చైతన్య’ వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

ఇటీవలే మరో తెలుగు అమ్మాయి ‘దేత్తడి హారిక’ కూడా ఒక సినిమాకి సైన్ చేసింది. సంతోష్ శోభన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ తన డెబ్యూ ఇవ్వబోతుంది. ఇప్పుడు మరో అమ్మాయి కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న భామ ‘దీపికా పిల్లి’. ఇక ఆ ఫేమ్ ని ఉపయోగించుకొని బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా.. పలు టీవీ షోలకు హోస్ట్ గా చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపుని సంపాదించుకుంది.

అయితే యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో.. హీరోయిన్ గా చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందట. దీపికా రీసెంట్ గా ఓ సినిమాకి సైన్ చేసిందట. గతంలో పలు షోల్లో దీపికాతో పాటు యాంకరింగ్ చేసిన ప్రదీప్ ఆ సినిమాలో హీరోగా చేస్తున్నారట. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్.. ఇప్పుడు రెండో సినిమాకి సిద్దమవుతున్నారట. అందుకే షోస్ కి కూడా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికాని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో దీపికా హీరోయిన్ గా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.