Deepika Padukone : తిరుమలకు కాలినడకన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) కాలినడకన తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండా తిరుమలకు వెళ్లారు.

Published By: HashtagU Telugu Desk
Deepika Padukone Went to Tirumala by Walk

Deepika Padukone Went to Tirumala by Walk

మన సెలబ్రిటీలు కాక బాలీవుడ్(Bollywood) నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు తిరుమలకు(Tirumala) వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. జాన్వీ కపూర్ అయితే రెగ్యులర్ గా కుదిరినప్పుడల్లా వస్తుంది. ఇటీవల షారుఖ్ కూడా తన జవాన్ సినిమా రిలీజ్ ముందు తిరుమలకు వచ్చారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు అయితే కాలినడకన వెళ్తారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) కాలినడకన తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండా తిరుమలకు వెళ్లారు. నిన్న రాత్రి దీపికా పదుకొనే, తన సోదరి అనిషా పదుకొనే, తన స్టాఫ్ తో కలిసి తిరుమలకు నడిచి వెళ్ళింది. దీపికా తిరుమలకు నడిచి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

నేడు ఉదయం దీపికా పదుకొనే వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనుంది. ఇక దీపికా ఈ సంవత్సరం పఠాన్ సినిమాతో భారీ హిట్ కొట్టి, జవాన్ లో కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. త్వరలో హృతిక్ సరసన ఫైటర్ సినిమాతో రానుంది.

 

Also Read : Bhanumathi – Savitri : సావిత్రి, భానుమతి చుట్టూ.. ఉత్తమ నటి వివాదం..

  Last Updated: 15 Dec 2023, 07:08 AM IST