Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంధీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ లో భాగం కాదన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సమాచారం ప్రకారం, దీపికా పదుకోణే కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లతో దర్శకుడిని ఆశ్రయించడంతో చిత్రబృందం ఆమెను సినిమా ఆమెను సినిమా నుంచి తప్పిచిందని టాలీవుడ్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ గానీ, దీపికా టీం గానీ అధికారికంగా స్పందించలేదు.
తెలుగు మీడియా నివేదికల ప్రకారం, దీపికా పదుకోణే రోజుకు కేవలం 8 గంటల పని, భారీ పారితోషికం, లాభాల్లో వాటా కోరడం మాత్రమే కాకుండా, తమిళ్/తెలుగు డైలాగ్‌లు తాను మాట్లాడకుండా డబ్బింగ్ చేయాలంటూ డిమాండ్ చేసిందట. ఈ డిమాండ్లపై సంధీప్ వంగా అసంతృప్తిగా ఉన్నాడని, ప్రస్తుతం ఆమె స్థానంలో కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నాడని సమాచారం.
ఇక దీపికా వైపు వర్గాలు చెపుతుంది చూస్తే, “ఒక తల్లి కోసం రోజుకు 8 గంటల పనిదినం అడగడం అన్యాయమేమీ కాదు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కొత్త తల్లులకు అనుకూలంగా మార్పులు వస్తున్నాయి. సినిమారంగం కూడా ఆ మార్పులను స్వీకరించాల్సిన అవసరం ఉంది.”
ఇటీవలి మారీ క్లేర్ (Marie Claire) మాగజైన్ ఇంటర్వ్యూలో దీపికా తన మాతృత్వ ప్రయాణం గురించి ఓపిగ్గా వివరించింది. “చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు నా బిడ్డ దూఅ (Dua)తో గడిపే ప్రతి క్షణం విలువైనది. అప్పుడప్పుడు పని కోసం ఆమెతో ఉండలేనప్పుడు నన్ను నన్నే తప్పుపడతాను,” అని పేర్కొంది. “బిడ్డ పుట్టిన తర్వాత జీవితం ఆగిపోతుందనే భావన తప్పు. మునుపటి జీవితంలో ఒక భాగాన్ని అయినా తిరిగి పొందాలి,” అని దీపికా చెప్పింది.
దీపికా భవిష్యత్తు ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఆమె 2025 రెండవార్థంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ ‘కింగ్’ లో నటించనున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, సుహానా ఖాన్, అభయ్ వర్మ, అభిషేక్ బచ్చన్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.