Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం AA22xA6 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె సంచలనాత్మక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న రెండు కీలక తెలుగు ప్రాజెక్టులైన కల్కి 2898 AD సీక్వెల్, స్పిరిట్ నుండి దీపికా తప్పుకున్నారు. ఈ నిర్ణయంపై సినీ వర్గాల నుండి, అభిమానుల నుండి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ‘జవాన్’ ఫేమ్ దీపికా పదుకొణె తాజాగా హార్పర్స్ బజార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు.
పారితోషికం సమస్య కాదు
ప్రభాస్ సినిమాల నుండి తాను తప్పుకోవడానికి కారణం పారితోషికం (రెమ్యూనరేషన్) లేదా షెడ్యూల్ సమస్యలు కాదని దీపికా స్పష్టం చేశారు. “ఇది ఇకపై రూ. 100 కోట్లు లేదా రూ. 500–600 కోట్ల సినిమాల గురించి కాదు” అని ఆమె ఖచ్చితంగా చెప్పారు. ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా, కమర్షియల్ విజయం సాధించే అవకాశాలు ఎంత ఉన్నా, ఇప్పుడు తన ఎంపికలపై ఆ అంశాలు ప్రభావం చూపడం లేదని ఆమె తేల్చిచెప్పారు.
Also Read: I Bomma Immadi Ravi : పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి..నాంపల్లి కోర్టు సంచలనం..!
ఆరోగ్యమే ముఖ్యం
పెద్ద నిర్మాణాల వల్ల పనిలో ఏర్పడే ఒత్తిడి, అధిక డిమాండ్‌పై ఆమె గళం విప్పారు. “కొన్నిసార్లు నిర్మాతలు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చి, అది ఒక్కటే సరిపోతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు” అని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన పని వాతావరణం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన దీపికా “రోజుకు ఎనిమిది గంటల పని సరిపోతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ అత్యుత్తమ పనితీరును అందించగలరు” అని అన్నారు.
దీపికా చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి, ఆమె తన శ్రేయస్సుకు, ప్రస్తుత వ్యక్తిగత విలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభాస్ చిత్రాల నుండి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. కమర్షియల్ ఆకర్షణ కంటే పనిలో సంతృప్తి, ఆరోగ్యం ముఖ్యమని ఆమె చాటి చెప్పారు. ఇదిలా ఉండగా స్పిరిట్ చిత్రం కోసం దీపికా స్థానంలో నటి త్రిప్తి డిమ్రీని ఎంపిక చేశారు. కల్కి 2898 AD సీక్వెల్ చిత్రానికి సంబంధించిన హీరోయిన్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
