ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ హిట్ డైరెక్టర్ అట్లీ (Allu Arjun – Atlee)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరనే చర్చకు ఫుల్ స్టాప్ పడింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone) ఈ చిత్రంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె పాత్రకు సంబంధించిన మోషన్ పిక్చర్ షాట్లు చూపించగా, ఆమె ఒక వారియర్ ప్రిన్సెస్‌గా కనిపిస్తోంది. గతంలో అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ చిత్రంలో నటించిన దీపికా, మళ్లీ అదే డైరెక్టర్‌తో జతకట్టడం విశేషం.
SBI : పెరుగుతున్న సైబర్ మోసాలపై ఎస్బీఐ కీలక సూచన
ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, మిగిలిన రెండు అన్నదమ్ములుగా ఉండే పాత్రలుగా ఉంటాయని, వీరిలో ఒకరు హీరో అయితే మరొకరు విలన్ పాత్రలో కనిపించనున్నారని టాక్. దీపికా పదుకోన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా సినిమాలో అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, అలాగే ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎంపిక అయ్యారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథానాయకుడిగా అల్లు అర్జున్, కథానాయికలుగా ఈ ముగ్గురు భారీ స్థాయిలో అలరించనున్నారు.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని చెన్నై సినీ వర్గాల సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం అల్లు అర్జున్ మరియు అట్లీ అమెరికాలో ప్రముఖ గ్రాఫిక్ కంపెనీలను సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలపై అధికారిక టైటిల్ ఇంకా బయటకు రాలేదు కానీ, “ఐకాన్” అనే పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.