Deepika Padukone: కేన్స్ కు దీపిక బై బై.. శోక రసాన్ని పండిస్తూ జ్యురీ టీమ్ వీడియో

దీపికా పదుకొనె.. ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

Published By: HashtagU Telugu Desk
Deepika

Deepika

దీపికా పదుకొనె.. ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా 8 మందినే న్యాయ నిర్ణేతలుగా ఎంపిక చేయగా, వారిలో ఒకరు మన దీపిక. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసినందున.. అక్కడి హోటల్ లో ఇన్నాళ్లు బసచేసిన న్యాయ నిర్ణేతల టీమ్ సభ్యులు తమతమ దేశాలకు బయలుదేరారు. ఈక్రమంలో అందరూ కలిసి కేక్ కట్ చేసి వీడ్కోలు పార్టీ జరుపుకున్నారు.

సినీ రంగంతో అవినాభావ సంబంధం కలిగిన ఆ 8 మంది న్యాయ నిర్ణేతలకు యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీడ్కోలు పార్టీ సందర్భంగా దీపికా అండ్ జ్యురీ టీమ్ కలిసి శోక రసాన్ని పండించారు. ఏడుపు మొహాలతో కెమెరాకు ఫోజులు ఇచ్చారు. సరదాగా తీసిన ఈ వీడియోను దీపిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ఇప్పుడు వ్యూస్, లైక్స్, షేర్స్ వెల్లువెత్తుతున్నాయి. 8 రోజుల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రతిరోజూ తన డ్రెస్సింగ్ సెన్స్ తో దీపిక అదుర్స్ అనిపించింది. ప్రతిరోజు ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసి దీపిక హల్ చల్ చేసింది.

 

  Last Updated: 30 May 2022, 11:55 AM IST