Deepika Padukone: ఎకానమీ క్లాస్‌లో దీపికా.. వీడియో వైరల్!

బాలీవుడ్ టాప్ నటీమణుల్లో దీపికా పదుకొనే (Deepika Padukone) ఒకరు. 2007లో ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది దీపికా. ఆ తర్వాత ఆమె తనకంటూ ఓ బలమైన గుర్తింపును సంపాదించుకుంది.

Published By: HashtagU Telugu Desk
Deepika Padukone

Resizeimagesize (1280 X 720) (1) 11zon

బాలీవుడ్ టాప్ నటీమణుల్లో దీపికా పదుకొనే (Deepika Padukone) ఒకరు. 2007లో ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది దీపికా. ఆ తర్వాత ఆమె తనకంటూ ఓ బలమైన గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్ అగ్ర నటి దీపిక విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఇప్పుడు ఆమె విమానంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని తన సోషల్ మీడియా ఖాతాలో నటి వీడియోను పోస్ట్ చేశాడు.ఈ వీడియోలో దీపిక,ఆమె బాడీ గార్డ్ ఆమె వెనుక నడుస్తూ కనిపించారు.

అయితే ఈ వీడియో మూడు రోజుల క్రితం వీడియో. నటి విమానం లోపల ఎకానమీ క్లాస్‌లో ఆరెంజ్ రంగు ట్రాక్ సూట్, క్యాప్, గాగుల్స్ ధరించి కనిపించింది. ఇప్పుడు ఆమెకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీపిక ఇటీవల షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం నటించిన ‘పఠాన్’ మూవీలో కనిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన 22 రోజుల్లోనే పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 970 కోట్లు వసూలు చేసింది.

Also Read: 12 cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు 12 చీతాలు!

‘పఠాన్’ చిత్రం సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ (2015), అమీర్ ఖాన్ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ (2017) చిత్రాలను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ భారతీయ చిత్రంగా నిలిచింది. దీపిక తదుపరి చిత్రాల గురించి మాట్లాడితే.. ఆమె తదుపరి చిత్రం ఫైటర్. ఇందులో ఆమె హృతిక్ రోషన్ సరసన కనిపిస్తుంది. ఈ సినిమాతో పాటు తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్టు కే మూవీలో కూడా నటిస్తుంది.

  Last Updated: 17 Feb 2023, 12:53 PM IST