Deepika Padukone: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. ఈ నటి తన 16 ఏళ్ల సినీ కెరీర్‌లో భారీగా సంపాదించినట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Deepika Padukone

Wallpapersden.com Deepika Padukone In Beautiful Green Dress Wallpaper 1280x720 11zon

Deepika Padukone: బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. ఈ నటి తన 16 ఏళ్ల సినీ కెరీర్‌లో భారీగా సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటి ఆస్తుల విలువ రూ. 497 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా దీపికా ఇప్పుడు తన ఒక్కొక్క సినిమాకు 15 నుండి 16 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

2007లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్‌ కెరీర్‌ని ప్రారంభించిన తర్వాత దీపిక పదుకొణె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. హాలివుడ్ సినిమాల్లో సైతం ఈ భామ తళుక్కుమంటోంది. దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో దీపిక పలు సినిమాల్లో నటించి 52 అవార్డులు గెలుచుకుంది. దీపికా పదుకొణె ప్రస్తుతం బాలివుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటీమణుల్లో ఒకరు. ప్రస్తుతం కూడా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 15-16 కోట్లు తీసుకుంటారు. సినిమాలతో పాటు దీపిక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా కూడా చాలా సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం.. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం రూ. 7 నుండి 10 కోట్లు వసూలు చేస్తుంది.

Also Read: Ravi Teja- Gopichand: రవితేజ- గోపిచంద్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..!

సోషల్ మీడియా ద్వారా ఎండార్స్‌మెంట్ల కోసం ఆమె సుమారు 1.5 కోట్లు వసూలు చేస్తుంది. ఆమె వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 24 కోట్లకు చేరువలో ఉంది. దీపిక బ్రాండ్ విలువ 400 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె నికర విలువ 497 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది. దీపికా పదుకొణెకు ముంబైలో 4 బిహెచ్కే విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు రూ.16 కోట్లు. ఆమె భర్త రణవీర్ సింగ్‌తో కలిసి అలీబాగ్‌లో విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది. దీని ఖరీదు రూ.21 కోట్లు. దీపిక దగ్గర మెర్సిడెస్ మేబ్యాక్, ఆడి A8, ఆడి క్యూ7 బిఎమ్‌డబ్ల్యూ 5 వంటి అనేక ఖరీదైన బ్రాండ్‌ల కారులు ఉన్నాయి.

దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ నవంబర్ 13, 2018న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల షారుఖ్ సరసన పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది దీపికా. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

  Last Updated: 09 Jul 2023, 01:10 PM IST