Deepika Padukone – Ranveer Singh : దీపికా పదుకోన్ – రణవీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో వీరు పెళ్లి చేసుకోగా గత నెల సెప్టెంబర్ లో ఓ పాపాకు జన్మనిచ్చారు. ఇక సెలబ్రిటీల పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి వార్తల్లోనే ఉంటారు. దీపికా – రణవీర్ కి కూడా పాప పుట్టిన దగ్గర్నుంచి ఆ పాపని ఎప్పుడు చూపిస్తారా అని ఫ్యాన్స్, బాలీవుడ్ ఎదురుచూస్తుంది. ఇక ఆ పాపకు ఏం పేరు పెడతారా అని ఇన్నాళ్లు ఎదురుచూసారు.
తాజాగా దీపికా పదుకోన్ తన కూతురు పేరుని దీపావళి సందర్భంగా ప్రకటించింది. తన కూతురి పాదాల ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దువా పదుకోన్ సింగ్ అని తన కూతురు పేరుని ప్రకటించింది. దువా అంటే ప్రార్థన అని, మా ప్రార్థనలకు ప్రతిరూపం ఈమె అని తెలిపింది దీపికా. ఇక దువా పేరు పక్కన దీపికా పదుకోన్ నుంచి పదుకోన్, రణవీర్ సింగ్ నుంచి సింగ్ తీసుకొని దువా పదుకోన్ సింగ్ అని పెట్టారు.
దీంతో ప్రస్తుతం దీపికా – రణవీర్ కూతురి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి దువా పదుకోన్ సింగ్ అని తమ పాప పేరుని ప్రకటించారు, ఆ పాపని ఎప్పుడు చూపిస్తారో చూడాలి.
Also Read : Fashion Designer: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనారోగ్యంతో కన్నుమూత