Site icon HashtagU Telugu

Sai Pallavi: ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తాయి. సాయిపల్లవి ఎమోషనల్ పోస్ట్..!!

Saipallavi1

Saipallavi1

సాయిపల్లవి ఉత్తమ నటిగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. యాక్షన్ స్కోప్ ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 2015లో నివిన్ పౌలీతో కలిసి నటించిన ప్రేమమ్ చిత్రంతో ఆమె తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద బిగ్ సక్సెస్ అయ్యింది. అప్పటి నుంచి సాయిపల్లవి వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో హిట్ మూవీలో ఆమె అకౌంట్లో చేరాయి. కలి,ఫిదా, మారి2, లవ్ స్టోరీ, శ్యాం సింఘా రాయ్ ఇలా ఎన్నో హిట్ మూవీస్ ఉన్నాయి.

కాగా అక్టోబర్ 2న బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో సాయిపల్లవి రెండు అవార్డులను గెలుచుకుంది. లవ్ స్టోరీ మూవీలో తన నటనకు ఉత్తమ నటిగా, శ్యామ్ సింఘా రాయ్ బెస్ట్ క్రిటిక్ అవార్డును గెలుచుకుంది.

ఈ అవార్డులకు సంబంధించిన అవార్డులను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సాయిపల్లవి. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తాయి. ఒకే ఏడాది రెండు సినిమాలు. ఇది చాలా ప్రత్యేకం. ఈ పాత్రల పట్ల నాకున్న అపారమైన ప్రేమకు నేను కృతజ్ఞురాలి. ఇలాంటి అందమైన పాత్రలు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది.