Devara Pre Release Event: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వస్తున్న మూవీ దేవర (Devara Pre Release Event). ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మూవీకి మరింత బజ్ తెచ్చేందుకు చిత్ర బృందం వరుస పెట్టి ప్రమోషన్లు చేస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీన ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. అంతేకాకుండా మూవీ గురించి కొన్ని హింట్‌లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత సన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఓ ఇంటర్వ్యూ వదిలారు. ఇది కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
తాజాగా చిత్రబృందం తమిళ ప్రేక్షకుల్లోకి సినిమా తీసుకుపోవటానికి చెన్నైలో ఓ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అయితే అన్ని లాంగ్వేజెస్‌లో చిత్ర బృందం ఏదో ఒక రకంగా మూవీ ప్రమోషన్ చేస్తూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు మాత్రం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ మూవీ ఈవెంట్ కర్నూల్‌లో జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Curry Leaves Water: కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
కొన్ని కారణాల వలన ఏపీలో ఈవెంట్‌కు ఏపీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మూవీ ఈవెంట్ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఈనెల 22వ తేదీన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. గతంలో కొరటాల శివ డైరెక్షన్‌లో మహేశ్ బాబు యాక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమాకి తారక్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ కృతజ్ఞతాభావంతోనే సూపర్ స్టార్ మహేశ్ తారక్ మూవీ ఈవెంట్‌కు రావటానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ కథనాయికగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 27న పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది.