Dasara Third Song: ‘దసరా’ థర్డ్ సాంగ్ ‘చమ్కీల అంగీలేసి’ వచ్చేస్తోంది!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల పాన్ ఇండియా చిత్రం దసరా ఫస్ట్-లుక్ పోస్టర్‌ల నుండి టీజర్‌ వరకూ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దసరా నుంచి థర్డ్ సింగిల్ వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న దసరా చిత్రంలోని ముడువ పాట ‘చమ్కీలా అంగీలేసి’ మార్చి 8న విడుదల చేయనున్నారు. ఇది ప్రతి పెళ్లిళ్ల సీజన్‌కి […]

Published By: HashtagU Telugu Desk
Dasara

Dasara

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల పాన్ ఇండియా చిత్రం దసరా ఫస్ట్-లుక్ పోస్టర్‌ల నుండి టీజర్‌ వరకూ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దసరా నుంచి థర్డ్ సింగిల్ వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న దసరా చిత్రంలోని ముడువ పాట ‘చమ్కీలా అంగీలేసి’ మార్చి 8న విడుదల చేయనున్నారు. ఇది ప్రతి పెళ్లిళ్ల సీజన్‌కి జానపద పాట. అనౌన్స్‌మెంట్ పోస్టర్  క్యూరియాసిటీని పెంచుతుంది. పోస్టర్‌లో నాని దసరా బుల్లోడుగా కనిపిస్తుండగా, కీర్తి సురేష్ చీరలో అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ యొక్క అందమైన కెమిస్ట్రీని ఈ పాట చూపించనున్నట్లు తెలుస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

  Last Updated: 04 Mar 2023, 11:59 AM IST