Site icon HashtagU Telugu

Dasara Premieres: యూఎస్ లో దసరా దూకుడు.. మహేశ్, బన్నీ రికార్డులు బద్దలు!

Dasara

Dasara

టాలీవుడ్ నేచరల్ స్టార్ నాని మొదటిసారి పాన్ ఇండియా దసరా మూవీతో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నాని కెరీర్ లో పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. తెలంగాణలోని మారుమూల పల్లెలోని సింగరేణి నేపథ్యం ఉన్న దసరా సినిమా ఇప్పటికే USA లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. దేశీయ, ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో నాని సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా ఇప్పటివరకు $500K+ వసూలు చేసింది. ఇది నాని కెరీర్ లో చాలా ఎక్కువ. అయితే USAలో ముందే సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ధీటుగా ద‌స‌రా సినిమా యుఎస్‌లో వ‌సూళ్ల‌ను రాబ‌డుతుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే మ‌హ‌ర్షి, పుష్ప ది రైజ్ చిత్రాల ప్రీమియ‌ర్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను ద‌స‌రా సినిమా క్రాస్ చేసేసింది. ఈ బాక్సాఫీస్ లెక్క‌లు చూసి నాని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే ఇత‌ర హీరోల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదే జోరు కొన‌సాగితే మాత్రం ద‌సరా క‌లెక్ష‌న్స్ ప‌రంగా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేయ‌టం ప‌క్కా అని అంటున్నారు.

Also Read: Hyderabad Police: సెలబ్రిటీల ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తే జైలుకే

 

Exit mobile version