Site icon HashtagU Telugu

Dasara Worldwide Collection Day 1: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న‘దసరా’..మైండ్ బ్లాకింగ్ వసూళ్లు.

Dasara1

Dasara1

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా (Dasara Worldwide Collection Day 1) మూవీ శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నానికి జోడిగా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. రూ. 70కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టేబుల్ లాస్ తో విడుదలయ్యింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. అనుమానాలన్నీ పటా పంచలు చేస్తూ మొదటి రోజు మొదటి షో సినిమాలపై భారీ అంచనాలను పెంచింది. నాని తన నటవిశ్వరూపం చూపించాడు. దసరా సినిమా మాస్ ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. శ్రీరామనవమి దసరాకు బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ తొలిరోజు అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. దాదాపు రూ. 25కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్టగొట్టింది దసరా మూవీ. దసరా’ తొలిరోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్ల సంఖ్యను సినీ విమర్శకుడు రమేష్ బాల తెలిపారు. దసరా 38 కోట్లు రాబట్టి నంబర్ 1 సినిమాగా నిలిచింది’ అని ట్వీట్ చేశాడు.