Site icon HashtagU Telugu

KJQ : దసరా బ్యానర్ లో కింగ్ జాకీ క్వీన్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ పోస్టర్ అదుర్స్..!

Dasara Banner Next Movie Kjq Deekshith Shetty Yukti Tareja Shashi Odela

Dasara Banner Next Movie Kjq Deekshith Shetty Yukti Tareja Shashi Odela

KJQ దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఆ సినిమాలో నటించిన దీక్షిత్ శెట్టితో ఒక సినిమా చేస్తున్నారు. దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు కింగ్ జాకీ క్వీన్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. కె.జె.క్యూ టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్. దసరా సినిమా తర్వాత సుధాకర్ చెరుకూరి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ ఏర్పడింది.

ఈ సినిమాను కెకె డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో శశి ఓదెల కూడా నటిస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. నాగ శౌర్య నటించిన రంగబలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యుక్తి తరేజా ఈ సినిమాతో సెకండ్ ఛాన్స్ అందుకుంది.

కింగ్ జాకీ క్వీన్ ఈ సినిమా పోస్టర్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేశారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ కె.జె.క్యూ ఎలా ఉంటుందో చూడాలి.