Site icon HashtagU Telugu

Suhani Bhatnagar: దంగల్ ఫేమ్ మృతి, 19 ఏళ్లకే తిరిగిరాని లోకానికి

Suhani Bhatnagar

Suhani Bhatnagar

Suhani Bhatnagar: రీసెంట్గా చాలామంది స్టార్స్ ని పోగొట్టుకున్న ఫిలిం ఇండస్ట్రీ తాజాగా మరో స్టార్ ని పోగొట్టుకుంది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ చిత్రంలో నటించిన సుహాని భట్నాగర్ మరణం అందర్నీ షాక్‌కి గురి చేసింది. కేవలం 19 వయసులో ఆమె మృతి సినీ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. ఈ న్యూస్ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో సుహానీ ఏ లోకాన్ని విడిచి వెళ్లడం ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. .

దంగల్ చిత్ర చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని భట్నాగర్ కొంతకాలం క్రితం ప్రమాదంలో గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు ప్రాక్చర్ అయ్యిందట. ఇందుకు వాడిన మెడిసిన్ రియాక్షన్ కావడంతో బాడీ అంతా నీరు పట్టిందట. దీంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుహాని ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్‌ తీసుకుంటుండగానే ఆమె మృతి చెందింది. సుహానీ తన ఫ్యామిలీతో ఫరీదాబాద్ లో ఉంటున్నారు. ఆమె అంత్యక్రియలు సెక్టార్ 15 లోని అజ్రౌండా స్మశాన వాటికలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: ZIM vs IND T20: జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా రహానే