Choreographer Chaitanya: ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య అందర్నీ షాక్ కు గురి చేసింది. ఆదివారం నెల్లూరులోని ప్రముఖ హోటల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు చైతన్య ఓ సెల్ఫీ వీడియో బయటపెట్టాడు. అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. చైతన్య ఆత్మహత్యపై ప్రముఖ డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ స్పందించారు. చైతన్య మరణంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యపై ఝాన్సీ మాట్లాడుతూ… చైతన్య అన్న నిర్ణయం షాకింగ్ కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నయ్య నిర్ణయం వల్ల తన కుటుంబం ఎంతో బాధపడుతుంది. అన్నయ్య ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ ఆర్టిస్టులతో కూర్చుని మాట్లాడితే పరిస్థితి వేరేలా ఉండేదని బాధపడ్డారు కండక్టర్ ఝాన్సీ. చైతన్య మంచి వ్యక్తిత్వం కలిగిన వాడని, ఎవరికైనా సమస్య వస్తే ముందుండేవాడని వాపోయింది ఝాన్సీ. అయితే ఓ విషయంలో చైతన్య అన్నయ్య చాలా నష్టపోయాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఓ కమిటీ వారు డ్యాన్స్ కండక్ట్ చేయగా కొంతమంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండ్ ఇచ్చారని, దీని కారణంగా ఆ కమిటీ వాళ్ళు చైతన్యకు రావాల్సిన 6 లక్షల రూపాయలు ఆపేసినట్టు ఝాన్సీ గుర్తు చేశారు. ఆ సమయంలో తోటి కళాకారులకు అప్పు చేసి చెల్లించినట్లు తెలిపారు. ఇలా చైతన్య మీద అప్పుల భారం పెరిగి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
Read More: Keerthy suresh : ముద్దబంతి పువ్వులా కీర్తి సురేష్ బ్యూటీఫుల్ ఫోటోస్..