Site icon HashtagU Telugu

Yash : హీరోగా మారుతున్న డ్యాన్స్ మాస్టర్ యశ్.. దిల్ రాజు నిర్మాణంలో సినిమా..

Dance Master Yash turned as Hero in Dil Raju Productions

Dance Master Yash turned as Hero in Dil Raju Productions

ఇండస్ట్రీలో డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చిన యశ్(Yash) పలు టీవీ షోలలో పాల్గొని, పలు సినిమాలకు డ్యాన్సర్ గా వర్క్ చేసి త్వరగానే డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ గా యశ్ ఇప్పటికే చాలా సినిమాలకు, చాలా మంది స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. ప్రస్తుతం యశ్ సినిమాలు, పలు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.

కొన్ని సినిమాలలో కూడా యశ్ సాంగ్స్ లో మెరిపించాడు. యశ్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. ఇటీవల దిల్ రాజు కూతురు, అల్లుడు నిర్మాతలుగా మారి దిల్ రాజు ప్రొడక్షన్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాగా బలగం తీసి భారీ హిట్ కొట్టారు. బలగం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. ఇప్పుడు రెండో సినిమాగా మ్యూజికల్ లవ్ ఎంటెర్టైనర్ తో రాబోతున్నారు.

డ్యాన్స్ మాస్టర్ యశ్ హీరోగా, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా శశికుమార్ దర్శకత్వంలో హన్షిత, హర్షిత నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే మెలోడీ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Also Read  : Tillu Square : DJ టిల్లు 2 వచ్చేశాడు.. అనుపమతో ఓపెన్ గా ఫ్లర్టింగ్ చేస్తున్న టిల్లు..