ఇండస్ట్రీలో డ్యాన్సర్(Dancer) గా ఎంట్రీ ఇచ్చిన యశ్(Yash) పలు టీవీ షోలలో పాల్గొని, పలు సినిమాలకు డ్యాన్సర్ గా వర్క్ చేసి త్వరగానే డ్యాన్స్ మాస్టర్(Dance Master) అయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ గా వరుస సినిమాలు, పలు షోలతో బిజీగా ఉన్న యశ్ ఇప్పుడు హీరోగా సినిమా చేస్తున్నాడు. దిల్‌రాజు(Dil Raju) కూతురు, అల్లుడు నిర్మాతలుగా మారి దిల్‌రాజు ప్రొడక్షన్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే.
దిల్‌రాజు ప్రొడక్షన్స్ లో మొదటి సినిమాగా బలగం(Balagam) తీసి భారీ హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సినిమాగా మ్యూజికల్ లవ్ ఎంటెర్టైనర్ తో రాబోతున్నారు. డ్యాన్స్ మాస్టర్ యశ్ హీరోగా, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా శశికుమార్ దర్శకత్వంలో హన్షిత, హర్షిత నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే మెలోడీ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ చాలా క్యూట్ గా ఉంది. హీరో, హీరోయిన్స్ మధ్య క్యూట్ సన్నివేశాలు చూపించారు. హీరోయిన్.. నా కోసం ఎంత దూరం వస్తావు, సముద్రాలు, ఆకాశం దాటి వస్తావా అని అడిగితే ఆకాశం దాకా కాదు కానీ ఏ బస్సో, ట్రైనో ఉన్న ఊరు అయితే వచ్చేస్తా అంటాడు హీరో. మరీ ఇంత లో బడ్జెట్ ప్రేమా అని అడిగితే లో బడ్జెట్ ప్రేమే కానీ టైం మొత్తం నీకే అంటూ హీరో ఇంప్రెస్ చేస్తాడు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఒక మెలోడీ ప్రేమ కథలా ఉండబోతుందని తెలుస్తుంది. డ్యాన్స్ మాస్టర్ గా సక్సెస్ అయిన యశ్ ఇప్పుడు హీరోగా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.
#AakasamDhaatiVasthaava teaser is here 🤩
to enchant you with a cool, pleasant and beautiful love story! 💕https://t.co/vCEuW8aA4l@JevaYashwanth @karthikamurali_ @Sasi_mutthuluri @singer_karthik @saregamasouth @HR_3555 #HanshithaReddy @DilRajuProdctns pic.twitter.com/ggT17y9oOZ— Dil Raju Productions (@DilRajuProdctns) August 4, 2023
Also Read : Annayya Movie : అన్నయ్య సినిమాలో చిరుకి తమ్ముళ్లుగా ఆ హీరోలు నటించాల్సింది.. కానీ..!