Site icon HashtagU Telugu

Hero Vijay : హైదరాబాద్ లోని మాస్ థియేటర్ లో సలార్ చిత్రాన్ని చూసిన హీరో విజయ్

Vijay Salaar

Vijay Salaar

తమిళ హీరో విజయ్ (Hero Vijay) నటించిన సైన్స్, ఫిక్షన్, యాక్షన్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAt). వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ మూవీ లో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు నటించారు. సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు మేక‌ర్స్.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా న‌టుడు వైభ‌వ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న‌ప్పుడు విజ‌య్ ప్ర‌భాస్ న‌టించిన ‘స‌లార్’ సినిమాను ఒక మాస్ థియేట‌ర్‌లో చూసినట్లు తెలిపారు. ‘గోట్’ (GOAT) షూటింగ్ అయిపోయాక సాయంత్రం విజ‌య్ స‌ర్ అడుగుతూ.. ఏదైనా సినిమాకు వెళ‌దామా అంటే… ఎలా స‌ర్ అన్నాను. ఏంటి మనం సినిమాకు పోకుడదా.. నువ్వు వ‌స్తావా రావా అంటూ అన్నాడు. దాంతో వ‌స్తున్నా స‌ర్ అన్నాను. ఆ టైంలో రిలీజ్ అయిన వాటిలో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ఉంటే ఆ సినిమాకు నేను, ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు, విజ‌య్ స‌ర్ క‌లిసి వెళ్లాం. ఆ త‌ర్వాతి రోజు ‘సలార్’ (Salar ) సినిమాకు వెళదాం అన్నాడు. అయితే ఆ సినిమా చూడ‌డానికి ఒక సినిమా ఫ్యాన్ ఎలాంటి థియేట‌ర్‌కు వెళతాడో అలాంటి మాస్ థియేట‌ర్‌కి వెళదామని విజయ్ అన్నాడు.. దాంతో నగరంలో ఉన్న మాస్ థియేట‌ర్‌కి వెళ్లి ‘స‌లార్’ సినిమా చూసాం. ఆ థియేట‌ర్‌లో టికెట్టు ఖరీదు రూ.80. అయితే అలాంటి థియేట‌ర్‌లో బాల్క‌నీ ఫ‌స్ట్ రో టికెట్ తీసుకుని సినిమా చూశాడు విజ‌య్. అయితే ఇది చాలా స్పెష‌ల్. స‌ర్ అనుకోని ఉంటే థియేట‌ర్ మొత్తం బుక్ చేసుకుని చూసేవాడు. కానీ మాస్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకోని ఆ థియేటర్ కు వెళ్లి సినిమా చూసినట్లు వైభవ్ తెలిపారు. ప్రస్తుతం వైభవ్ తెలిపిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Read Also : NTR : కాంతార ప్రీక్వెల్లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్