Daku Maharaj Ticket Price : ‘డాకు మహారాజ్’ టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్

Daku Maharaj Ticket Price : ' ఏపీ సర్కార్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చి మేకర్స్ తో పాటు అభిమానుల్లో సంతోషం నింపింది

Published By: HashtagU Telugu Desk
Dakumaharaj Ticket Price

Dakumaharaj Ticket Price

‘డాకు మహారాజ్’ (Daku Maharaj) మేకర్స్ కు ఏపీ సర్కార్ (AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. మూవీ టికెట్ ధరలు పెంచుకునే (Daku Maharaj Ticket Price Hike ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ..సంక్రాంతి బరిలో ‘డాకు మహారాజ్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి హీరోయిన్లు నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో ఏపీ సర్కార్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చి మేకర్స్ తో పాటు అభిమానుల్లో సంతోషం నింపింది. సినిమా రిలీజయ్యే జనవరి 12న ఉ.4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటికి మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.135, సింగిల్ స్క్రీన్లపై రూ.110 హైక్ ఇచ్చింది. ఏ మూవీ తో పాటు గేమ్ ఛేంజర్ మూవీకి కూడా టికెట్ ధరలు కూడా పెంచుకునే అవకాశం ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంట షో (బెన్ఫిట్)కు టికెట్ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.175, సింగిల్ స్క్రీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్ తో టికెట్స్ విక్రయించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : Naga Chaitanya : తండేల్ నుంచి అదిరిపోయే సాంగ్..!

  Last Updated: 04 Jan 2025, 11:24 PM IST